Posts

Showing posts with the label mahilaa sanghalu

తెలంగాణ డ్వాక్రా మహిళా సంఘాలకు శుభవార్త !

Image
డ్వాక్రా మహిళ సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. మహిళలకు అండగా ఉండేందుకు, వారికి ఆర్థికపరమై చేయుతనిచ్చేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఇందులో భాగంగానే డ్వాక్రా మహిళ సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ విడుదల చేసింది. కొత్తగా ఏర్పడిన డ్వాక్రా సంఘాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మొదటి విడతగా ప్రతీ మహిళా సంఘానికి 15000 రూపాయిలు రివాల్వింగ్ ఫండ్‌ను విడుదల చేసింది. ఈ ఫండ్ నేరుగా వారి ఖాతాలో జమ చేయనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నగదును మళ్లీ తిరిగి కట్టాల్సిన అవసరం లేదు.