Posts

Showing posts with the label it is not possible - our relationship is like milk and honey

మాది పాలు,తేనె సంబంధం - ఎంతగా పులుపు నింపాలన్నా సాధ్యం కాదు !

Image
క ర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివ కుమార్‌పై నిఘా పెట్టేందుకు ఫోన్‌ ట్యాపింగ్‌ జరుగుతోందని ప్రతిపక్షనేత అశోక్‌, కేంద్రమంత్రి కుమారస్వామి ఆరోపణలపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య మండిపడ్డారు. తానెందుకు డీసీఎం ఫోన్‌ ట్యాప్‌ చేస్తానన్నారు. మేమిద్దరం బాగున్నామని, మా బంధం చెడపకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను దొంగనై ఇతరులను నమ్మడం లేదనే సామెతలా, ఇవో అసంతృప్తి వ్యాఖ్యలన్నారు. ఆరోపణలపై సీఎం ఒక ప్రకటన విడుదల చేశారు. తనతో డీకే శివకుమార్‌ సంబంధం బాగుందని, వారు ఎంతగా పులుపు నింపాలన్నా సాధ్యం కాదని, మాది పాలూ, తేనెలాంటి సంబంధం అన్నారు. ఆరోపణలు చేసినవారు ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు డీసీఎం, హోం మంత్రిగా వ్యవహరించిన వారన్నారు. ఇంటెలిజెన్స్‌ వారి పాలనలోనూ ముఖ్యమంత్రి వద్దే ఉండేదని, ప్రస్తుత ఆరోపణలు వారి అనుభవమా అని ప్రశ్నించారు. మాది ప్రజాస్వామ్యం కల్గిన కాంగ్రెస్‌ పార్టీ అన్నారు. ప్రధాని ఎదుట నోరు తెరిచేందుకు, కాళ్లు, చేతులు వణికేలాంటి బీజేపీ కాదని, కుటుంబ ఆధిపత్యం కల్గిన జేడీఎస్‌ కూడా కాదన్నారు. మా ఎమ్మెల్యేలు ఎవరూ నాకూ లేదా డీసీఎం డీకే శివకుమార్‌కు అనుచరులు కాదని, అందరూ కాంగ్రెస్‌ వారే అన్నారు. పార్టీ క్రమశి...