Posts

Showing posts with the label it intends to establish a Joint Venture

టాటా ఆటో కాంప్‌తో చేతులు కలిపిన బాష్‌

Image
ఆటో విడిభాగాల కంపెనీ టాటా ఆటోకాంప్‌ సిస్టమ్స్‌తో టెక్నాలజీ బాష్‌ లిమిటెడ్‌తో చేతులు కలిపింది. తద్వారా భాగస్వామ్య కంపెనీ (జేవీ)ని ఏర్పాటు చేయనున్నట్లు బాష్‌ పేర్కొంది. జేవీ ప్రధానంగా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ అవసరాలకు అనుగుణమైన ఇంజినీరింగ్, తయారీపై దృష్టి పెట్టనున్నట్లు తెలియజేసింది. సమాన వాటాతో పుణేలో ఏర్పాటు చేయనున్న జేవీ అన్ని అనుమతులు లభిస్తే 2026 మధ్యలో కార్యకలాపాలు ప్రారంభించగలదని అంచనా వేసింది. దేశీయంగా ఇంజినీరింగ్, తయారీ, ఈయాక్సిల్‌ సిస్టమ్స్, ఎలక్ట్రిక్‌ మోటార్స్‌ విక్రయాలను చేపట్టనున్నట్లు వెల్లడించింది. భారత్‌ ప్రపంచంలోనే మూడో పెద్ద ఆటోమోటివ్‌ మార్కెట్‌కాగా, దీంతో దేశీయంగా లభించనున్న భారీ అవకాశాలను అందిపుచ్చుకోవాలని బాష్‌ లక్ష్యంగా పెట్టుకుంది.