ఏసర్ ప్రెడేటర్ హీలియోస్ 18 ఏఐ విడుదల
ఏ సర్ ప్రెడేటర్ హీలియోస్ 18 ఏఐ (2026) పేరుతో ల్యాప్‌టాప్ ను తీసుకొచ్చింది. అత్యంత అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, కళ్లు చెదిరే స్పెసిఫికేషన్లతో లాంచ్ అయింది. ఈ ఏడాది చివర్లో ఇది అంతర్జాతీయంగా విక్రయానికి రానుంది. ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్, ఎన్విడియా ఆర్‌టీఎక్స్ 5090 గ్రాఫిక్స్ కార్డ్ వంటి అత్యంత శక్తివంతమైన హార్డ్‌వేర్‌తో ఈ గేమింగ్ ల్యాప్‌టాప్‌ను రూపొందించారు. ఈ సరికొత్త గేమింగ్ ల్యాప్‌టాప్ ధరను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఇది ఈ ఏడాది ఆగస్టు నెలలో నార్త్ అమెరికా , ఇఎమ్ఇఎ మార్కెట్లలో మొదటిసారిగా అమ్మకానికి రానున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఆ తర్వాత 2026 చివరి త్రైమాసికంలో ఆస్ట్రేలియా మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఈ ల్యాప్‌టాప్ విండోస్ 11 ప్రో , విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో గరిష్టంగా 18-అంగుళాల 4K (3,840×2,400 పిక్సెల్స్) మినీ ఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇది 1,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 240Hz రిఫ్రెష్ రేట్, ఎన్విడియా అడ్వాన్స్‌డ్ ఆప్టిమస్, ఎన్విడియా జీ-సింక్, 100 శాతం డిసిఐ-పి3 కలర్ గ్యామట్, హెచ్‌డి...