ఇజ్రాయెల్ - లెబనాన్ మధ్య ప్రత్యక్ష చర్చలు : తీవ్రంగా వ్యతిరేకించిన హెజ్బొల్లా
ద శాబ్దాల కాలంగా బద్ధశత్రువులుగా ఉన్న ఇజ్రాయెల్ మరియు లెబనాన్ దేశాలు మంగళవారం వాషింగ్టన్‌లో ప్రత్యక్ష దౌత్య చర్చలు జరిపాయి. ఈ భేటీని "చారిత్రక అవకాశం"గా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అభివర్ణించారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ఇరు దేశాల ప్రతినిధులు సరిహద్దుల్లో ఉద్రిక్తతల తగ్గింపు, శాంతి స్థాపనపై చర్చించారు. లెబనాన్‌పై హెజ్బొల్లా పట్టు సడలిందని, ఇది ఆ దేశానికి విముక్తి కలిగించే గొప్ప అవకాశమని ఇజ్రాయెల్ రాయబారి యెహీయెల్ లైటర్ పేర్కొన్నారు. ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా బలహీనపడటం శుభపరిణామమని ఆయన అన్నారు. లెబనాన్ రాయబారి నాదా హమదే మౌవాద్ తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని కోరారు. తమ దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని, యుద్ధం కారణంగా నిరాశ్రయులైన లక్షలాది మంది ప్రజలు తిరిగి తమ ఇళ్లకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చర్చలను హెజ్బొల్లా తీవ్రంగా వ్యతిరేకించింది. చర్చలు జరుగుతున్న సమయంలోనే ఉత్తర ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, రాకెట్లతో విరుచుకుపడింది. మంగళవారం ఒక్క రోజే సుమారు 24 దాడులు చేసినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. మరోవైపు, లెబనాన్ ప్రభుత్వం హెజ్బొల...