Posts

Showing posts with the label head of Samsung's mobile division

ప్రతి ఉత్పత్తిలో ఏఐని అంతర్భాగం చేయాలని శాంసంగ్ నిర్ణయం

Image
శాం సంగ్ సంస్థ తన భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను తన ప్రతి ఉత్పత్తిలోనూ అంతర్భాగం చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు శాంసంగ్ మొబైల్ విభాగం అధిపతి టీఎం రోహ్ సంస్థ నూతన వ్యూహాన్ని వెల్లడిస్తూ, కేవలం స్మార్ట్‌ఫోన్‌లకే పరిమితం కాకుండా గృహోపకరణాలు , ఇతర డిజిటల్ సేవలన్నింటిలో AIని అనుసంధానించనున్నట్లు ప్రకటించారు. దీనిని వారు “ఏఐ ఎక్సపీరియన్స్” (ఏఎక్స్) గా అభివర్ణిస్తున్నారు. వినియోగదారుల రోజువారీ అవసరాలను గుర్తించి, వాటికి అనుగుణంగా స్పందించేలా తమ డివైజ్‌లను తీర్చిదిద్దడం ద్వారా మార్కెట్‌లో తన పట్టును మరింత పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. శాంసంగ్ తన 2026 రోడ్‌మ్యాప్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, గృహోపకరణాలు , ఇతర అన్ని డివైజ్‌లలో AI సాంకేతికతను చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. కస్టమర్లకు అత్యుత్తమ అనుభవాన్ని అందించడానికి డివైస్ ఎక్సపీరియన్స్ (డీఎక్స్) విభాగంలోని అన్ని ఉత్పత్తులు , సేవలలో ఏఐని విడదీయలేని భాగంగా మార్చాలని కంపెనీ భావిస్తోంది. శాంసంగ్ మొబైల్ విభాగం హెడ్ టీఎం రోహ్ మాట్లాడుతూ, AI అనేది కేవలం ఒక సాధనం మాత్రమే కాదని, అది మన ఆలోచనా విధానాన...