Posts

Showing posts with the label five or six Cabinet Ministers and 12 Ministers of State are likely to be dropped

కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళనకు ముహూర్తం ఖరారు ?

Image
కేంద్ర మంత్రివర్గం ప్రక్షాళనకు ముహూర్తం దాదాపు ఖరారైంది. ఈ నెల 15వ తేదీ కేబినెట్ విస్తరణ తో కొత్త గవర్నర్ల నియామకం పైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కనీసం ఐదారుగురు కేబినెట్ మంత్రులు, 12 మంది సహాయ మంత్రులను తొలగించనున్నట్లు సమాచారం. వీరిలో కొందరికి పార్టీ బాధ్యతలు కట్టబెడతారని, ఈనెల 20వ తేదీ తర్వాత ఎప్పుడైనా మంత్రివర్గ పునర్వ్యవస్థీక రణ చేపట్టవచ్చని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఢిల్లీలో పార్టీ ఆఫీసు బేరర్లు, రాష్ట్ర అధ్యక్షులతో చర్చలు జరిపారు. ఏపీ, తెలంగాణ నుంచి ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో అయిదుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు శాఖలు మారుతాయనే ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్, పెమ్మసాని కొనసాగటం ఖాయమని పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా, తెలంగాణ నుంచి కొత్తగా మరో సహాయ మంత్రిగా అవకాశం దక్కుతుందని అంచనా వేస్తున్నారు.