Posts

Showing posts with the label first time in the iOS beta version of the TikTok app.

లాంగ్‌ వీడియోలపై టిక్‌టాక్‌ పరీక్షలు ?

Image
దే శంలో షార్ట్-వీడియో-మేకింగ్ ప్లాట్‌ఫారమ్ టిక్‌టాక్ ఎక్కువ ప్రజాదరణ పొందింది. టిక్‌టాక్‌ను కేంద్రం నిషేధించింది. అయితే ఇతర దేశాల్లో టిక్‌టాక్‌ అందుబాటులో ఉంది. అయితే కేవలం షార్ట్‌వీడియోలకు మాత్రమే పరిమితమైన టిక్‌టాక్‌ తాజాగా వినియోగదారులకు 30 నిమిషాల వీడియోలను అప్‌లోడ్ చేయడంలో సహాయపడే కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గూగుల్ యాజమాన్యంలోని వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన యూట్యూబ్‌ను పోటీగా ఈ వ్యూహాత్మకంగా టిక్‌టాక్‌ ఈ అప్‌డేట్‌ తీసుకొస్తుందని టెక్‌ నిపుణులు పేర్కొంటున్నారు. టిక్‌టాక్‌ యాప్‌నుకు సంబంధించిన ఐఓఎస్‌ బీటా వెర్షన్‌లో మొదటిసారి ఈ కొత్త అప్‌డేట్‌ను టెక్‌ నిపుణులు గుర్తించారు. టిక్‌టాక్‌ మొదట్లో అసలు వీడియో సమయ పరిమితి 15 సెకన్లతో ప్రారంభించబడింది, ఆపై దానిని ఒక నిమిషం వరకు అప్‌గ్రేడ్ చేసింది. ఆపై దానిని మూడు నిమిషాలకు విస్తరించింది. తరువాత దానిని 10 నిమిషాలకు పొడిగించింది. టిక్‌టాక్‌ కొన్ని నెలల క్రితం 15 నిమిషాల వీడియో అప్‌లోడ్ పరిమితిని పరీక్షించడం ప్రారంభించింది. కొత్త 30 నిమిషాల వీడియో పరిమితి చైనీస్ యాప్‌కి కొత్త అవకాశాలను తెరిచే అవకాశం ఉ...