తొలి రోజు ధురంధర్ రికార్డ్ ను బ్రేక్ చేసిన బోర్డర్ 2 సినిమా
ర ణ్‌వీర్ సింగ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ధురంధర్ రికార్డులను బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీడియోల్ నటించిన బోర్డర్ 2 బద్ధలు కొట్టింది. 1971 భారత్ - పాకిస్తాన్ యుద్ధం ఇతివృత్తం ఆధారంగా రెండు దేశాల మధ్య జరిగిన ఆపరేషన్ చెంఘీజ్ ఖాన్, పూంచ్, బసంతార్, ఐఎన్ఎస్ కుక్రీ ఆధారంగా బోర్డర్ 2 సినిమాను తెరకెక్కించారు. భారత త్రివిధ దళాల అసమాన ధైర్య సాహసాలు, సమన్వయం, సైనికుల బలిదానం, దేశభక్తి కలయికలో ఈ సినిమాను రూపొందించారు. టీ సీరిస్ ఫిల్మ్స్, జేపీ ఫిల్మ్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కిషన్ కుమార్ సంయుక్తంగా ఈ బోర్డర్ 2 సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. సన్నీడియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, ఆహాన్ శెట్టి, సోనమ్ బజ్వా, సునీల్ శెట్టి, అక్షయ్ ఖన్నా, సుదేశ్ బెర్రీ, అన్య సింగ్, మోనా సింగ్ తదితరులు నటించారు. అన్షుల్ చోబే సినిమాటోగ్రఫి, మనీష్ మోరే ఎఢిటింగ్, జాన్ స్టీవార్డ్ ఎడ్యూరి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. అనుమాలిక్, మిథూన్, విశాల్ మిశ్రా స్వరాలు సమకూర్చారు. గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 23వ తేదీన బోర్డర్ 2 వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. నటీనటులు, సాంకేతిక న...