Posts

Showing posts with the label eye specialists will visit the schools

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు !

Image
ఆం ధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా కంటి చూపు సమస్యలతో చదువులో వెనుకబడుతున్న నిరుపేద విద్యార్థులను ఆదుకునేందుకు బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు తొలుత కంటి పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో పాఠశాలలకే కంటి వైద్య నిపుణులు వచ్చి ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా పరీక్షించి, ఎవరికి దృష్టి లోపం ఉందో గుర్తిస్తారు. పరీక్షల్లో చూపు సమస్య ఉన్నట్లు తేలిన విద్యార్థికి ప్రభుత్వం ఉచితంగా కంటి అద్దాలను అందజేస్తుంది. నాణ్యమైన అద్దాలను అందించాలని అధికారులకు పక్కా ఆదేశాలు జారీ అయ్యాయి. చాలా మంది పిల్లలు బోర్డు మీద అక్షరాలు కనిపించక, తలనొప్పి రావడంతో చదువుపై ఆసక్తి తగ్గించుకుంటారు. పేదరికం కారణంగా ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి అద్దాలు కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులకు ఈ పథకం ఒక వరం లాంటిది. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారి కళ్ళల్లో వెలుగు చూడాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. చూపు బాగుంటేనే చదువు బాగుంటుంది, చదువు బాగుంటేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందనే నినాదంతో ప్రభు...