Posts

Showing posts with the label estimated cost of ₹1

మెరీనా తీరంలో తమిళనాడు సచివాలయం, అసెంబ్లీ భవన్‌ నిర్మాణం

Image
చెన్నై మెరీనా తీరంలోని పట్టినంబాక్కంలో 25 ఎకరాల విస్తీర్ణంలో బ్రహ్మాండ తమిళనాడు సచివాలయం, అసెంబ్లీ భవన్‌ రూపుదిద్దుకోనున్నది. ఇందుకు సంబంధించిన కసరత్తులు మొదలయ్యాయి. బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన చారిత్రాత్మక సెయింట్‌ జార్జ్‌ కోట భవనంలో ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వ సచివాలయం, శాసనసభ కొనసాగుతున్నాయి. అక్కడ తీవ్రమైన వాహనాల రద్దీ, పార్కింగ్‌ ఇబ్బందులు ప్రజల రద్దీ పెరిగిన నేపథ్యంలో చెన్నై పట్టినంబాక్కంలో కొత్త సచివాలయాన్ని నిర్మించడానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ కొత్త సచివాలయం, శాసనసభ సముదాయాన్ని నిర్మించనున్నారు. ఇందులో ప్రధాన భవనాన్ని 20 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో, 15 అంతస్తుల ఎత్తులో అత్యంత అధునాతనంగా రూపొందించనున్నారు. గిండిలోని హైవేస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, నందంబాక్కం ఫిన్‌టెక్‌ సిటీ ఎదురుగా ఉన్న భూములను పరిశీలించిన అనంతరం,పట్టినంబాక్కంలోని 25 ఎకరాల భూమిని ఈ నిర్మాణాలకు ప్రభుత్వం ఆమోదించింది. శాంతోమ్‌ ప్రధాన రహదారిని అనుసంధానించే ఈ స్థలం తమిళనాడు హౌసింగ్‌ బోర్డు పరిధిలోకి వస్తుంది. ఇక్కడ చదరపు అడుగు మార్కెట్‌ మార్గదర్శక...