Posts

Showing posts with the label entire airport has been inspected

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కి బాంబు బెదిరింపు - హైదరాబాద్ ఇండిగో ఫ్లైట్‌పై లేజర్ లైట్

Image
హై దరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. కోల్‌కతా - హైదరాబాద్ ఇండిగో ఫ్లైట్‌పై లేజర్ లైట్ పడటంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. విమానాశ్రయం అంతా ముమ్మర తనిఖీలు చేపట్టారు. మరోవైపు కోల్‌కతా- శంషాబాద్ ఇండిగో ఫ్లైట్‌పై లేజర్ లైట్ పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఇండిగో విమానాన్ని లేజర్ లైట్లు తాకాయని అక్కడి అధికారులు వెల్లడించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఇటీవల వరుస బాంబు బెదిరింపు మెయిల్స్, ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విమానయాన సిబ్బంది అప్రమత్తమై.. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఈ తరహా బెదిరింపు కాల్స్, మెయిల్స్‌పై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఏడాదిలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఇప్పటివరకు 30కి పైగా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.