Posts

Showing posts with the label Zip Meridian Track Edition released

జిప్ మెరిడియన్‌ ట్రాక్ ఎడిషన్ విడుదల

Image
జిప్ ఇండియా తన పాపులర్ మోడల్ మెరిడియన్‌లో ట్రాక్ ఎడిషన్ పేరుతో ఒక లిమిటెడ్ ఎడిషన్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధరను రూ.35.95 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించగా, అదిరిపోయే 4×4 వెర్షన్ ధర రూ.37.82 లక్షలుగా ఉంది. టయోటా ఫార్చ్యూనర్ వంటి దిగ్గజ కార్లకు గట్టి పోటీ ఇచ్చేలా జీప్ ఈ కొత్త వేరియంట్‌ను తీర్చిదిద్దింది. ఈ ట్రాక్ ఎడిషన్‌లో చేసిన అతిపెద్ద మార్పు కారు లోపల సెకండ్ రో సీట్లలో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సీట్లను 140 మి.మీ వరకు ముందుకు, వెనుకకు జరుపుకోవచ్చు. దీనివల్ల మూడో వరుసలో కూర్చునే వారికి కావలసినంత లెగ్ రూమ్ దొరుకుతుంది, అలాగే లోపలికి వెళ్లడం, బయటకు రావడం మరింత సులభమవుతుంది. కస్టమర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే కంపెనీ ఈ సౌకర్యాన్ని కల్పించింది. డ్యూయల్ టోన్ ఇంటీరియర్‌తో పాటు కారు లోపల అక్కడక్కడా ట్రాక్ ఎడిషన్ బ్యాడ్జింగ్‌ను ఇచ్చి మరింత రిచ్ లుక్ ఇచ్చారు. బయటి నుంచి చూస్తే ఈ కారు మరింత అగ్రెసివ్‌గా కనిపిస్తోంది. గ్రిల్ దగ్గర పియానో బ్లాక్ ఫినిషింగ్, 18 అంగుళాల డైమండ్ కట్ అలాయ్ వీల్స్ కారుకు మంచి రాజసాన్ని అద్దాయి. బోనెట్ మీద ప్రత్యేకమైన డీకల్స్, న్యూట్రల్ గ్రే యాక్స...