అదానీ సోలార్‌కు 'గ్రేడ్ ఏ' హోదాను కేటాయించిన వుడ్ మాకెంజీ
అ దానీ సోలార్ వుడ్ మాకెంజీ 2026 గ్లోబల్ పీవీ మాడ్యూల్ తయారీదారుల ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానాన్ని దక్కించుకుంది. భారతీయ సంస్థలలో ఇదే అత్యుత్తమ స్థానం. అదానీ న్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సోలార్ తయారీ విభాగం అయిన అదానీ సోలార్, ఈ వార్షిక మూల్యాంకనంలో అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటింది. గత ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న అదానీ సోలార్, ఇప్పుడు ఆరో స్థానానికి మెరుగుపడింది. ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 జాబితాలో నిలిచిన ఏకైక భారతీయ తయారీ సంస్థ ఇదేనని వుడ్ మాకెంజీ నివేదిక పేర్కొంది. ఈ అధ్యయనంలో భాగంగా 48 సోలార్ మాడ్యూల్ తయారీదారులను వారి సామర్థ్య వినియోగం, సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక పనితీరు, సరఫరా గొలుసు పటిష్టత మరియు నిర్వహణ సామర్థ్యం వంటి అంశాల ఆధారంగా మూల్యాంకనం చేశారు. అదానీ సోలార్‌కు వుడ్ మాకెంజీ 'గ్రేడ్ ఏ' (Grade A) హోదాను కేటాయించింది. తయారీ, సాంకేతికత, ఆర్థిక ఆరోగ్యం మరియు సరఫరా గొలుసు పటిష్టతలో కంపెనీ కనబరిచిన పనితీరును ఇందులో పరిగణనలోకి తీసుకున్నారు. లొంగి గ్రీన్ ఎనర్జీ, జింకో సోలార్, జెఏ సోలార్ మరియు ట్రినాసోలార్ వంటి చైనీస్ సంస్థలు ఈ జాబితాలో మొదటి ఆరు స్థానాలను ఆక్రమించాయి....