సహారా ఎడారిలో దాహంతో 49 మంది వలసదారులు మృతి !
ప శ్చిమ ఆఫ్రికా దేశమైన నైజర్‌లోని సహారా ఎడారిలో చోటుచేసుకున్న ఒక దారుణ ఉదంతం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నిలువెల్లా దహించివేసే ఎండ తీవ్రతకు, చుక్క నీరు దొరకని భయంకర దాహానికి తట్టుకోలేక ఒకే గ్రూపునకు చెందిన 49 మంది వలసదారులు ఎడారిలోనే ప్రాణాలు విడిచారు. నైజర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరంతా మాలి దేశంలో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొని తిరిగి స్వస్థలాలకు వస్తున్నారు. నైజర్-అల్జీరియా సరిహద్దులోని అసమాకా ప్రాంతానికి చేరుకోగానే, వారు ప్రయాణిస్తున్న లారీ మార్గమధ్యలో హఠాత్తుగా పాడైపోయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా వాహనం స్టార్ట్ కాలేదు సరికదా, ఎడారి ఇసుకలో కూరుకుపోయింది. చుట్టుపక్కల కిలోమీటర్ల మేర ఎలాంటి జనసంచారం లేకపోవడం, సహాయం అందే మార్గం మూసుకుపోవడంతో ప్రయాణికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సహారా ఎడారిలోని భరించలేని ఉష్ణోగ్రతలు, ఉక్కపోతకు తోడు తాగడానికి నీరు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎండ వేడిమికి శరీరం సహకరించక, దాహం తట్టుకోలేక వలసదారుల్లో ఒక్కొక్కరుగా శ్వాస విడిచారు. అలా మొత్తం 49 మంది పర్యాటకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వ...