తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం : కొత్త కమిటీని నోటిఫై చేసిన కేంద్ర జలవనరుల సంఘం
తె లంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీజలాల వినియోగంలో నెలకొన్న వివాదాల పరిష్కారానికి సంబంధించిన కమిటీని ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకార సమాఖ్య విధానంతో గత 11 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల పరిష్కారానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తోందని చెప్పుకొచ్చారు. ఇందుకోసం ప్రత్యేకమైన వేదికలను ఏర్పాటుచేసి సమన్వయంతో సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఉదాహరణకు కృష్ణానది జల వివాద పరిష్కారానికి 6 అక్టోబర్ 2023నాడు KWDT-2ను ఏర్పాటుచేసి.. అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌ను నిర్దేశించింది. రెండేళ్ల కాల వ్యవధి 1 ఆగస్టు, 2025 నాడు ముగిసింది. కృష్ణాజలాల వినియోగంపై వాదనలు నడుస్తోండటంతో దీన్ని మరో ఏడాది (31 జూలై, 2026) పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇలా తెలుగు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం అన్నిరకాలుగా సహకరిస్తోంది. కాగా, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని చాప్టర్ 9, సెక్షన్ 84 ప్రకారం.. కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగానికి సంబంధించిన విషయంలో సమస్యల పరిష్కారం కోస...