Posts

Showing posts with the label Warangal police have arrested

ధరణి, భూ బారతి రిజిస్ట్రేషన్ల కుంభకోణం : 15 మంది నిందితుల అరెస్టు

Image
తె లంగాణలో ధరణి, భూబారతి రిజిస్ట్రేషన్లను అడ్డు పెట్టుకొని ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న అంతరాష్ట్ర ముఠాన్ని వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. జనగామ, యాదాద్రి జిల్లాల్లో సంచలనం సృష్టించిన ఈ రూ. 3.90 కోట్ల కుంభకోణంలో ప్రమేయం ఉన్న 15 మంది నిందితులను జనగామ పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో తొమ్మిది మంది పరారీలో ఉన్నారు. ఈ ముఠా నుండి రూ. 63.19 లక్షల నగదుతో పాటు సుమారు కోటి రూపాయల విలువైన ఆస్తి పత్రాలు, కారు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, 17 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ వివరాలను వెల్లడించారు. కుంభకోణంలో ప్రధాన నిందితులైన పసునూరి బసవరాజు, జెల్లా పాండు యాదగిరిగుట్టలో ఆన్లైన్ సర్వీస్ సెంటర్లు నిర్వహిస్తూ ఈ మోసానికి తెరలేపారు. వీరు వెబ్సైట్ లోని ఇన్స్పెక్ట్ ఎలిమెంట్, ఎడిట్ అప్లికేషన్ ఆప్షన్లను ఉపయోగించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలాన్ రుసుమును సాఫ్ట్వేర్ ద్వారా తగ్గించేవారు. రైతుల వద్ద నుంచి పూర్తి మొత్తాన్ని వసూలు చేసి, ప్రభుత్వానికి మాత్రం తక్కువ మొత్తాన్ని చెల్లిస్తూ నకిలీ రసీదులను సృష్టించేవారు. ఈ నకిలీ చలాన్లను స్థానిక ఎమ్మార్వో , రిజిస్ట్రేషన్ కార్యాలయ...