Posts

Showing posts with the label Warangal MP Kadiyam Kavya visited Kazipet Railway Manufacturing Unit

కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను సందర్శించిన ఎంపీ కడియం కావ్య

Image
తె లంగాణలోని కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను స్థానిక శాసనసభ్యులు కేఆర్ నాగరాజుతో కలిసి సందర్శించిన వరంగల్ ఎంపీ కడియం కావ్య రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో జరుగుతున్న పనుల పురోగతిని మౌలిక వసతుల అభివృద్ధిని విభాగాల వారీగా జరుగుతున్న నిర్మాణ కార్యక్రమాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీనిపైన సమగ్రంగా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన కడియం కావ్య కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ 30 సంవత్సరాల కల అని, అది ఇప్పుడు నెరవేరబోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే ఇది సాధ్యమైందని కడియం కావ్య స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. భూములు కోల్పోయిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రయత్నం చేస్తానని, యూనిట్ లోని వివిధ సర్వీసులలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కేంద్ర రైల్వే మంత్రిని కోరతానని ఆమె అన్నారు. స్థానికులకు అన్యాయం జరగకుండా చూస్తానని అన్నారు. భూ బాధితులకు స్థానికులకు ఉద్యోగాలపైన పార్లమెంటు సమావేశాలలో మాట్లాడతానని కడియం కావ్య వెల్లడించారు. ఈ రైల్వే మ్యానుఫ్యాక్చర్ యూనిట్లో ప్రతి సంవత్సరం 600 కోచ్ లు తయారవుతాయని వచ్చే మార్చ...