Posts

Showing posts with the label Vivo T5 5G to be launched on March 17

మార్చి 17న వివో T5 5G విడుదల

Image
దే శీయ మార్కెట్లో మార్చి 17న వివో కొత్త మొబైల్ T5 5G విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న వివో T4 X మొబైల్ కు కొనసాగింపుగా ఇది వస్తుంది. అయితే పాత మొబైల్ కంటే ఇందులో కొత్తగా 7400 టర్బో చిప్ సెట్ ఉండనుంది. అంతేకాకుండా ఇందులో ఇప్పటివరకు ఏ మొబైల్ లో లేని బ్యాటరీ ఉండనుంది. ఈ మొబైల్ లో 7200 mAh బ్యాటరీ ఉండగా ఇది 44 W ఫాస్టెస్ట్ చార్జింగ్ తో పనిచేస్తుంది. స్ట్రీమింగ్, గేమింగ్ తో పాటు, ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోరుకునే వారికి చార్జింగ్ ఇబ్బంది లేకుండా ఇది పనిచేస్తుంది. ఈ కొత్త మొబైల్ ఆండ్రాయిడ్ 16 ఆధార్ origin OS 6 పై పనిచేస్తుంది. అలాగే నీటి నుంచి రక్షణ కోసం IP 68 , IP 69 రేటింగ్ కలిగి ఉంది. దీని ధర రూ.23,000 లోపే ఉంటుందని అంటున్నారు. దీంతో మిడ్ రేంజ్ పీపుల్స్ ఈ మొబైల్స్ కొనడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో నాణ్యమైన కెమెరా కూడా అమర్చే అవకాశం ఉంది. 50 MP మెయిన్ కెమెరా ఉండగా..8 MP సెల్ఫీతో పాటు వీడియో కాలింగ్ కోసం అనుగుణంగా ఉంటుంది. 6.72 అంగుళాల HD +డిస్ప్లే ఉండడంతో మూవీస్ తో పాటు గేమింగ్ కోరుకునే వారికి ఇది అనుగుణంగా ఉంటుంది....