Posts

Showing posts with the label Vehicle Loses Control and Plows into Devotees in Srisailam

శ్రీశైలంలో నియంత్రణ కోల్పోయి భక్తులపైకి దూసుకెళ్లిన వాహనం : 10 మందికిపైగా గాయాలు

Image
శ్రీ శైలం ఆలయ టోల్‌గేట్ వద్ద వేగంగా వచ్చిన ఓ వాహనం నియంత్రణ కోల్పోయి అక్కడే ఉన్న భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో పది మందికిపైగా గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వెంటనే స్పందించిన ఆలయ సిబ్బంది, తోటి భక్తులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే వాహన డ్రైవర్‌ను స్థానికులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వాహనం బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా ? లేక డ్రైవర్ అజాగ్రత్త కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.