Posts

Showing posts with the label Vaisakhi festival

ఇటలీలో ఇద్దరు భారతీయుల దారుణ హత్య

Image
ఇ టలీలోని బెర్గామో ప్రావిన్స్‌లో వైశాఖి పండుగ వేళ అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. కోవో పట్టణంలోని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న గురుద్వారా మాతా సాహిబ్ కౌర్ జీ వద్ద జరిగిన ప్రార్థనల్లో పాల్గొని తిరిగి వెళ్తున్న ఇద్దరు భారతీయ వ్యక్తులను గుర్తుతెలియని దుండగుడు కాల్చి చంపాడు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ దాడిలో కోవో నివాసి అయిన 48 ఏళ్ల రగిందర్ సింగ్‌తో పాటు అగ్నాడెల్లోకు చెందిన 48 ఏళ్ల గుర్మిత్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు ఒక్కసారిగా వీరిపై తూటాల వర్షం కురిపించి కారులో పరారైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఘటనా స్థలంలో దాదాపు పది బుల్లెట్ కేసింగ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఏదో అకస్మాత్తుగా జరిగిన ఘర్షణ కాదని, అత్యంత పక్కా ప్రణాళికతో జరిగిన హత్యగా అధికారులు అనుమానిస్తున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా భారతీయ సంతతికి చెందినవాడేనని, అతను కూడా క్రమం తప్పకుండా అదే గురుద్వారాకు వస్తుంటాడని ఒక ప్రత్యక్ష సాక్షి ద్వారా తెలిసింది. ఈ దాడిలో మరో వ్యక్తి కూడా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.