సమాచార, ప్రసార శాఖకు రూ.4,551 కోట్లు కేటాయింపు
కేంద్ర బడ్జెట్‌లో సమాచార, ప్రసార శాఖకు రూ.4,551 కోట్లు కేటాయించారు. ఇందులో అధిక భాగం ఆలిండియా రేడియో, ప్రసారభారతికి దక్కనుంది. మిగతా నిధులను యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ రంగాల్లో నైపుణ్యం పెంపుదలకు, కమ్యూనిటీ రేడియో విస్తరణకు కేటాయించారు. 2025-26 బడ్జెట్‌లో ఈ శాఖకు కేటాయించింది రూ.6,103.02 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఈ దఫా సమాచార, ప్రసార శాఖకు ఇచ్చిన రూ.4,551 కోట్లలో ప్రసారభారతికి రూ.2,291.88 కోట్లను ప్రత్యేకించారు. ఈ నిధులను వేతనాలు, పింఛన్లు తదితరాల కోసం ఖర్చు పెడతారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూ.250 కోట్లను వెచ్చిస్తారు. ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వహణ, కొత్త చిత్రాలు, డాక్యుమెంటరీల నిర్మాణానికి రూ.344.55 కోట్లను, ఎఫ్‌ఎం ప్రసారాలతో ఆలిండియా రేడియో నెట్‌వర్క్ విస్తరణ, డీటీహెచ్ సామర్థ్యం పెంపు వంటి వాటికి రూ.509.24 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో మాదిరిగానే ఈసారి కూడా నిరక్షరాస్యుల కోసం కమ్యూనిటీ రేడియో కార్య క్రమాల నిమిత్తం రూ.8 కోట్లు కేటాయించారు. యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్, కామిక్స్(ఏవీజీసీ) రంగంలో నైపుణ్యాలను పెంచేందుకు దేశవ్యాప్త...