వాలెంటైన్స్ డే : రాజకీయంగా ప్రభావం కలిగించే డిజిటల్ కార్డుల శ్రేణిని సోషల్ మీడియాలో విడుదల చేసిన అమెరికా
వై ట్‌హౌస్ వాలెంటైన్స్ డే సందర్భరంగా రాజకీయంగా ప్రభావం కలిగించే డిజిటల్ కార్డుల శ్రేణిని సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇవి సాధారణ ప్రేమ కార్డుల మాదిరి కాకుండా, రాజకీయ పరిణామాలను, రాజకీయ నేతలను పరిహాసం చేసేలా రూపొందించారు. ఇందులో వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలాస్ మదురో కోసం ప్రత్యేకంగా ఒక గ్రీటింగ్ కార్డును వైట్‌హౌస్ రిలీజ్ చేసింది. ఇందులో నువ్వు నా మనసు దోచావ్ అంటూ మదురోపై సెటైర్లు వేస్తూ గ్రీటింగ్ కార్డు రిలీజ్ చేసింది. ఇందులో మదురోకు కళ్లకు గంతలు కట్టి, చేతులను బేడీలతో బందించి ఉన్న ఫోటోను పెట్టి, ఈ క్యాప్షన్ ఇచ్చింది. ఇలా పలు పరిణామాలను జోడిస్తూ వైట్‌హౌస్ ప్రేమ సందేశాలను పంపింది. మరో కార్డు ట్రంప్ ఒక "Executive Order 4547" అనే పత్రాన్ని పట్టుకుని, దానిపై "UR My Valentine" అని రాసి ఉన్నట్లు చూపిస్తుంది. మూడవ కార్డుపై డెమోక్రాటిక్ సెనేటర్ క్రిస్ వాన్ హోలెన్ ఎల్ సాల్వడార్‌లో MS-13 గ్యాంగ్ సభ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కిల్మార్ అబ్రెగో గార్సియాతో మార్గరిటాస్ తాగుతున్నట్లు చూపిస్తుంది. నీపై నా ప్రేమ, అక్రమ వలసదారులపై డెమోక్రాట్ల ప్రేమంత బలంగా ఉంది. నీతో ఒ...