Posts

Showing posts with the label US Secretary of State Mark Rubio

విదేశీయులకు లభించే వీసా రాజ్యాంగబద్ధమైన హక్కు కాదు!

Image
అ మెరికా వీసా అనేది విదేశీయులకు లభించే రాజ్యాంగబద్ధమైన హక్కు కాదని, అది కేవలం తమ దేశంలోకి ప్రవేశించేందుకు ఇచ్చే తాత్కాలిక అనుమతి మాత్రమేనని  అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో అన్నారు. హంగేరియన్ ప్రధానితో జరిగిన కీలక భేటీలో ఆయన మాట్లాడుతూ జాతీయ ప్రయోజనాలకు భంగం కలిగించేలా వ్యవహరించే విదేశీయుల వీసాలను తక్షణమే రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ నిబంధనలు పర్యాటకులు, విద్యార్థులు, జర్నలిస్టులు ఇలా అన్ని వర్గాల వారికి సమానంగా వర్తిస్తాయని ఆయన తేల్చి చెప్పారు.పర్యాటక, విద్యార్థి వీసాల ముసుగులో అమెరికాలోకి ప్రవేశించి, ఇక్కడి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించినా, లేదా అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేక చర్యలకు పాల్పడినా అస్సలు ఉపేక్షించబోమని విదేశాంగ శాఖ పేర్కొంది. గడిచిన ఏడాది కాలంలో ఇటువంటి కారణాలతోనే రికార్డు స్థాయిలో వీసాలను రద్దు చేసినట్లు రూబియో వెల్లడించారు. అమెరికా చట్టాలను గౌరవించని పక్షంలో ఆ అనుమతిని వెనక్కి తీసుకునే అధికారం తమకు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలను పదే పదే గుర్తు చేస్తున్నప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అటువంటి వారికి ఇకపై ఎలాంటి మినహాయి...