Posts

Showing posts with the label Transport Department Initiates Strict Action

బీహార్ లో సామాజిక ఐక్యతను దెబ్బతీసేలా వాహనాలపై కులాల పేర్లు, గుర్తులు : కఠిన చర్యలకు ఉపక్రమించిన రవాణా శాఖ

Image
బీ హార్ లో సామాజిక ఐక్యతను దెబ్బతీసేలా వాహనాలపై కులాల పేర్లు, గుర్తులు ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ నిర్ణయించింది. వాహనాలపై ఇప్పటికే కులానికి సంబంధించిన పేర్లు లేదా స్టిక్కర్లు వేయించుకున్న వారు, వాటిని వెంటనే తొలగించాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ కోసం వాహన యజమానులకు జూన్ మొదటి వారం వరకు గడువు ఇచ్చారు. నిర్ణీత గడువులోగా కులాల పేర్లను తొలగించని పక్షంలో, రవాణా శాఖ కఠినమైన జరిమానాలు విధించనుంది. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటారు. నిబంధనలకు విరుద్ధంగా కులాల పేర్లు కలిగి ఉన్న వాహనదారులకు 2 వేల రూపాయల ఫైన్ విధించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. వాహనాలపై కుల అస్తిత్వాన్ని చాటుకోవడం వల్ల సమాజంలో విద్వేషాలు పెరిగే అవకాశం ఉన్నందున, ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.