Posts

Showing posts with the label Transformers and Rectifiers (India) Ltd

దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలను అందించిన ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ రెక్టిఫయర్స్ (ఇండియా) లిమిటెడ్

Image
దీ ర్ఘకాలిక ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలను ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ రెక్టిఫయర్స్ (ఇండియా) లిమిటెడ్  అందించింది. 2020 ఏప్రిల్ సమయంలో ఈ కంపెనీ షేరు ధర కేవలం రూ. 3 మాత్రమే. కానీ  నేడు ఈ స్టాక్ రూ. 320 స్థాయికి చేరుకుంది. అంటే, ఆరేళ్ల క్రితం ఎవరైనా ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, నేడు దాని విలువ ఏకంగా రూ. 1.05 కోట్లు అయ్యేది. స్వల్పకాలిక ఒడిదుడుకులకు భయపడకుండా దీర్ఘకాలం పాటు వేచి చూసిన వారికి ఈ స్టాక్ 'కుబేరులను' చేసింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల భారత స్టాక్ మార్కెట్లు భారీగా దెబ్బతిన్నాయి. ఏప్రిల్ 23 సెషన్‌లో సెన్సెక్స్ 850 పాయింట్లు పతనమై 77,664 వద్ద, నిఫ్టీ 205 పాయింట్లు తగ్గి 24,173 వద్ద స్థిరపడ్డాయి. మార్చి నెలలోనైతే సెన్సెక్స్ ఏకంగా 11 శాతం కుప్పకూలింది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా, ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ రెక్టిఫయర్స్ స్టాక్ గురువారం సెషన్‌లో 3 శాతం లాభపడి రూ. 324.20 వద్ద గరిష్టాన్ని తాకడం విశేషం. కేవలం అదృష్టం వల్లే స్టాక్ ధర పెరగదు, కంపెనీ ఆర్థిక ఫలితాలు కూడా బలంగా ఉండాలి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 23 శాతం వృద్ధి...