Posts

Showing posts with the label Top Disaster Management Department official

"సీఎం సార్‌ను చూశాక.. ఇంటికి వెళ్లబుద్ధి కాలేదు" : విపత్తు నిర్వహణ విభాగం ఉన్నతాధికారి

Image
``సీఎం సార్ ను చూసిన తర్వాత.. ఇంటికి వెళ్లబుద్ధి కాలేదు.`` అని విపత్తు నిర్వహణ విభాగంలో పనిచేస్తున్న ఉన్నతాధికారి అన్నారు. పేరు చెప్పేందుకు ఇష్టపడని ఆయన, తుఫానులు, విపత్తుల సమయంలో మీడియాకు అత్యంత చేరువగా ఉంటారు. ఆయన ఏపీకి చెందిన అధికారి కూడా కాదు. ఉత్తరాది రాష్ట్రానికి చెందిన అధికారి. కానీ ఏపీ అంటే మనసు పెడతారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు హయాంలో ఆయన పనితీరుకు మంచి మార్కులు పడ్డాయి. గతంలో హుద్ హుద్ తుఫాను వచ్చినప్పుడు కూడా ఈయన దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. అలానే ఇప్పుడు కూడా మొంథా తుఫాను సమయంలో ఆయన అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు కూడా పేర్కొన్నారు. ``ఆయన ఉన్నారు. అన్నీ ఆయన చూసుకుంటారు. ఇది మంచిదే.. కానీ.. మీరు కూడా అలెర్టుగా ఉండండి`` అని అధికారులకు సూచించారు. అలా ఉన్నతస్థాయిలో ఉన్న అధికారి సోమవారం అర్ధరాత్రి తర్వాత కూడా ఆర్టీజీఎస్ కేంద్రంలోను, విపత్తుల నిర్వహణ కేంద్రంలోనూ(రెండూ ఒకే భవనంలో ఉంటాయి) తిరిగారు తప్ప, ఇంటి ముఖం పట్టలేదు. అప్పటి వరకు సీఎం చంద్రబాబు రాత్రి 11 గంటల సమయం దాకా తుఫానులపై సమీక్షించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కొంత రెస్టు తీసుకు...