Posts

Showing posts with the label They threw water bottles into the stadium

రసాభాసగా మారిన మెస్సీ కోలక్‌తా పర్యటన : నియంత్రణకోల్పోయి హింసకు దిగిన అభిమానులు

Image
మెస్సీ కోలక్‌తా టూర్‌ రసాభాసగా మారింది. నిర్వహణ లోపంతో అభిమానులు నియంత్రణకోల్పోయి హింసకు దిగారు. స్టేడియంలోకి వాటర్‌ బాటిళ్లు విసిరేశారు. సీట్లు ధ్వంసం చేశారు. గ్రౌండ్‌లోకి కుర్చీలు విరగ్గొట్టారు బారికేడ్లు దాటుకొని చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో జనాన్ని చెదర గొట్టడానికి పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. అభిమానులు టెంట్‌ను మరియు గోల్ పోస్ట్‌ను కూడా ధ్వంసం చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో లియోనెల్ మెస్సీని వీక్షించడానికి వేలాది మంది చేరుకున్నారు. నిర్వహణ లోపంతో అభిమానులు నియంత్రణకోల్పోయి హింసకు దిగారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఫలితంగా సాల్ట్‌ లేక్‌ స్టేడియం వెళ్లిన మెస్సీ కేవంల పది నిమిషాల్లో అక్కడ నుంచి వెళ్లిపోవడం అభిమానుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. మ్యాచ్‌ ఆడకుండా వెళ్లిపోయారని మండిపడ్డారు. రూ12 వేలు పెట్టి టికెట్ కొనుగోలు చేస్తే కనీసం తమ అభిమాన మెస్సీ మొఖాన్ని కూడా చూడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు మెస్సీ సమయాన్ని వృధా చేశారని అసహనం వ్యక్తం చేశారు. డార్జిలింగ్ నుంచి వచ్చిన మహిళా అభిమాని, తాను రూ. 12,000 కు ...