Posts

Showing posts with the label They discussed the India-US strategic partnership.

డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్‌

Image
అ మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్‌లో మాట్లాడారు. పుతిన్‌ భారత్‌ పర్యటన తర్వాత ట్రంప్‌కు మోడీ ఫోన్‌ చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్‌- అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిపారు. శక్తి, రక్షణ, భద్రత రంగాల్లో సహకారంపై మోదీ, ట్రంప్‌ చర్చించారు. ఉమ్మడి, లాభదాయక అంశాలపై కలిసి పనిచేయడానికి అంగీకారం తెలిపారు. వ్యాపారం, సాంకేతిక సహకారంపై కూడా చర్చించారు. మరోవైపు, భారత్-ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు పడింది.. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు బుధవారం ప్రధాని మోదీతో టెలిఫోన్‌లో సంభాషించిన సంగతి తెలిసిందే. నెతన్యాహు త్వరలో భారత పర్యటనకు రానున్నారు. ఇరువురు అగ్రనేతలు త్వరలో సమావేశం కావాలని నిర్ణయించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. మోదీ, నెతన్యాహు మధ్య స్నేహపూర్వక, ఆత్మీయ సంభాషణ సాగినట్లు ఇజ్రాయెల్ పీఎంవో పేర్కొంది.