Posts

Showing posts with the label These tickets are available in city

విశాఖలో 100 రూపాయలకే ట్రావెల్ యాజ్ యు లైక్ టికెట్ ప్రవేశపెట్టిన ఏపీఎస్ ఆర్టీసీ

Image
వి శాఖలో ఏపీఎస్ ఆర్టీసీ ట్రావెల్ యాజ్ యు లైక్ పేరుతో కేవలం 100 రూపాయలతోనే రోజంతా నగరంలో ఎక్కడ నుంచైనా, ఎక్కడి వరకైనా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుంది. దీంతో మహిళలు ఉచిత బస్సులలో విశాఖ నగరాన్ని చుట్టేస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబంలోని పురుషుల కోసం కూడా ఈ కొత్త బంపర్ ఆఫర్ ఉపయోగపడుతుంది. దీనిద్వారా కుటుంబమంతా తక్కువ ఖర్చుతోనే విశాఖ నగరాన్ని చుట్టి పలు పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. విశాఖ నగరంలో రామకృష్ణ బీచ్, కైలాసగిరి, ఋషికొండ బీచ్, భీమిలి బీచ్, ఎండాడ బీచ్ వంటి అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఒక్కో బీచ్ కు దానిదైన ప్రత్యేకత ఉంది. ఈ బీచ్ ల మధ్య దూరం కూడా దాదాపు 30కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంతేకాదు నగరంలో తొట్లకొండ, ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్, సింహాచలం, విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి ఇతర ప్రాంతాలను చూడడానికి కూడా అవకాశం ఉంది. దాదాపు 100 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న విశాఖ నగరంలో కేవలం 100 రూపాయలతోనే రోజంతా ప్రయాణం చేసే అరుదైన అవకాశాన్ని ఆర్టీసీ కల్పించింది. ఈ టికెట్ ను కొనుగోలు చేయడం ద్వారా డబ్బుల...