Posts

Showing posts with the label Thanjavur police felicitate 50 people wearing helmets by giving them 4-gram silver coins

హెల్మెట్‌ ధరించిన 50 మందికి 4 గ్రాముల వెండి నాణెం ఇచ్చి అభినందించిన తంజావూరు పోలీసులు

Image
త మిళనాడు లోని తంజావూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించేలా జిల్లా పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. దానిలో భాగంగా  హెల్మెట్‌ ధరించిన వాహనచోదకులకు పోలీసులు వెండి నాణేలు అందజేసి అభినందించారు. అలాగే, రోడ్డు నిబంధనలపై వాహనచోదకులకు అవగాహన కల్పిస్తున్నారు. హెల్మెట్‌ ధరించిన వాహన చోదకులకు ఇటీవల అరటి పండ్లు, 50 మందికి ఉచితంగా హెల్మెట్లు అందజేశారు. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరం సందర్భంగా నగర పోలీసు కమిషనర్‌ రవిచంద్రన్‌ నేతృత్వంలో పోలీసులు ఆట్రుపాలం సమీపంలోని అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా హెల్మెట్‌ ధరించిన 50 మందికి తలా 4 గ్రాముల వెండి నాణెం ఇచ్చి అభినందించారు. ఊహించని ఈ బహుమతికి వాహన చోదకులు ఆనందం వ్యక్తం చేశారు.