ఒడెసా నౌకాశ్రయంపై రష్యా క్షిపణి దాడి : ధ్వంసమైన వాణిజ్య నౌక : నలుగురు భారతీయ నావికులతో పాటు పది మంది మృతి
ఉ క్రెయిన్‌లోని కీలకమైన ఒడెసా నౌకాశ్రయంపై సోమవారం రష్యా జరిపిన క్షిపణి దాడిలో ఒక వాణిజ్య నౌక ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో నలుగురు భారతీయ నావికులు ఉన్నట్లు విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఉక్రెయిన్ ధాన్యం మరియు సరుకు రవాణాకు కీలకమైన ఒడెసా పోర్టును లక్ష్యంగా చేసుకుని రష్యా క్షిపణులను ప్రయోగించింది. అక్కడే లంగరు వేసి ఉన్న ఒక అంతర్జాతీయ వాణిజ్య నౌకపై క్షిపణి నేరుగా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో మొత్తం 10 మంది మరణించగా, అందులో నలుగురు భారతీయులు ఉన్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన మరో భారతీయ నావికుడి పరిస్థితి విషమంగా ఉందని, ప్రస్తుతం అతనికి అత్యవసర వైద్యం అందిస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయ దౌత్యవేత్త వ్లాదిమిర్ లడనోవ్‌కు విదేశాంగ మంత్రిత్వ శాఖ తక్షణ సమన్లు జారీ చేసింది.సైనిక చర్యల్లో భాగంగా నిరపరాధ పౌరులను బలితీసుకోవడం, వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం ఎంతమాత్రం సమంజసం కాదని భారత్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛా సముద్ర రవాణా మరియు వాణిజ్యాన్ని దెబ్బతీసే చర్యల...