Posts

Showing posts with the label Telangana records decline in registrations

తెలంగాణలో తగ్గిన రిజిస్ట్రేషన్ల సంఖ్య - గత ఏడాది కంటే రూ. 600 కోట్లు అదనంగా పెరిగిన ఆదాయం

Image
తె లంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత డిసెంబర్ నాటికి ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 50 వేళా మేర తగ్గింది. గత ఏడాది ఇదే సమయానికి 13 లక్షల డాక్యుమెంట్లు నమోదు కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 12.50 లక్షలకే పరిమితమైంది. అయినప్పటికీ, స్టాంపులు , రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రభుత్వానికి అందే ఆదాయం మాత్రం గత ఏడాది కంటే సుమారు రూ. 600 కోట్లు అదనంగా వచ్చింది. రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గినప్పటికీ ఆదాయం పెరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను పెంచడమే. 2026 ప్రారంభం నుండి ప్రభుత్వం అమలు చేసిన కొత్త మార్కెట్ విలువల వల్ల, తక్కువ లావాదేవీలు జరిగినప్పటికీ ప్రభుత్వానికి అందే స్టాంప్ డ్యూటీ ,రిజిస్ట్రేషన్ ఫీజులు భారీగా పెరిగాయి. దీనివల్ల 2025-26 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న రూ.19,100 కోట్ల భారీ ఆదాయ లక్ష్యాన్ని చేరుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆదాయం పెరగడానికి మరో ముఖ్య కారణం కొనుగోలుదారులు గృహ రుణాల వైపు మొగ్గు చూపడం. బ్యాంకుల నుంచి ఎక్కువ రుణం పొందడం కోసం, చాలామంది ప్లాట్లు లేదా ఫ్లాట్ల విలువను రిజిస్ట్రేషన్ సమయంలో అసలు మార్కెట్ ధరకే చూపిస్తున్నారు. గతంలో చాలావరకు ప్ర...