Posts

Showing posts with the label Telangana Coal Mines Issue

రాధాకృష్ణ రాసింది పిట్టకథలు, కట్టుకథలు : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

Image
తె లంగాణలో బొగ్గు గనుల వ్యవహారంలో తనపై ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసింది పిట్టకథలు, కట్టుకథలు రాశారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతివి అభూత కల్పనలు, ఈ వార్త విషయంలో తాను, రాధాకృష్ణ తేల్చుకుంటాం అని భట్టి విక్రమార్క అన్నారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా మీడియాతో మాట్లాడుతూ  'ప్రజల ఆస్తులను కాపాడటమే నా లక్ష్యం,  నా పని. ఆస్తులను సంపాదించడం కోసం, పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. ప్రజలను పీక్కు తింటున్న గద్దల నుంచి ప్రజలను రక్షించడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. నా లక్ష్యం ప్రజలకు సేవ చేయడం. సమాజంలో ఉన్న వనరులను ప్రజలకు సమానంగా పంచడానికి రాజకీయాల్లోకి వచ్చాను. ఈరోజు ఆంధ్రజ్యోతి చైర్మన్ రాధాకృష్ణ తొలిపలుకు అని వార్త రాశారు. రాష్ట్రంలో బొగ్గు గనుల కోసమే వార్త కథనాలు అని రాసుకొచ్చారు. ఆంధ్రజ్యోతి కథనంలో నా పేరు ప్రస్తావించారు. సింగరేణి అనేది తెలంగాణ ప్రజల ఆస్తులు. బొగ్గు గనులు ప్రజల ఆత్మ. టెండర్లను పిలిచింది సింగరేణి సంస్థ, సంస్థ బోర్డు. టెండర్ల నిబంధనలను చేసేది సంస్థ. మంత్రి కాదు. క్లిష్టతరమైన ప్రాంతాల్లో గనులుంటాయి కాబట్టి, ఫీల్డ్ విజి...