Posts

Showing posts with the label Tahsildar Dies by Suicide Under Train

రైలు కిందపడి తహసీల్దార్ ఆత్మహత్య

Image
త మిళనాడులోని కాట్పాడి నుంచి చిత్తూరు వైపు వస్తున్న మెము ఎక్స్‌ప్రెస్‌ సిద్ధంపల్లె వద్దకు చేరుకుంటుండగా తహసీల్దార్  శ్రీనివాసులు పట్టాలపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. సమాచారం అందుకున్న జీఆర్‌పీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. శ్రీనివాసులు 2024 ఎన్నికల సమయంలో రామాపురం తహసీల్దార్‌గా పనిచేశారు. ఎన్నికల అనంతరం ఆయనను లక్కిరెడ్డిపల్లెకు బదిలీ చేశారు. అనంతరం పీజీఆర్‌ఎస్‌కు సంబంధించిన ఒక ఫిర్యాదు నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఆ విచారణలో భాగంగా సంబంధిత మండలానికి చెందిన వీఆర్‌వో వెంకటరమణను సస్పెండ్ చేయగా, శ్రీనివాసులును కలెక్టరేట్‌లోని కోనేరు రంగారావు రిఫార్మ్స్ కమిటీ విభాగానికి బదిలీ చేశారు. జిల్లా కేంద్రం మదనపల్లెకు మారిన తర్వాత ఆయన పీజీఆర్‌ఎస్‌ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు మరోసారి విచారణ నిర్వహించి, కొన్ని తప్పులు జరిగినట్లు భావించి సంబంధిత నివేదికను సీసీఎల్‌ఏకు పంపినట్లు సమాచారం. కొంతకాలంగా శ్రీనివాసులు అనారోగ్యంతో బాధపడుతూ సెలవులో ఉన్నా...