Posts

Showing posts with the label TVS Motor Sells 473970 Vehicles in April

ఏప్రిల్‌ నెలలో 4,73,970 వాహనాలను విక్రయించిన టీవీఎస్‌ మోటార్‌

Image
ఏ ప్రిల్‌ నెలలో 4,73,970 వాహనాలను టీవీఎస్‌ మోటార్‌ విక్రయించింది. గతేడాది ఇదే నెలలో అమ్మిన 4,43,716 యూనిట్లతో పోలిస్తే ఇవి 7% అధికంగా ఉన్నాయి. టూ వీలర్స్‌ మొత్తం విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 6% పెరిగి 4,30,150 నుంచి 4,55,333 యూనిట్లకు చేరాయి. దేశీయ ద్విచక్ర వాహన విక్రయాల్లో 8 శాతం వృద్ధి సాధించింది. గతేడాది ఏప్రిల్‌లో 3,23,647 యూనిట్లుగా ఉన్న అమ్మకాలు, ఈ ఏడాది 3,48,545 యూనిట్లకు చేరాయి. గతేడాది 1,69,741 యూనిట్లుగా ఉన్న స్కూటర్ల విక్రయా లు, ఈసారి 24 శాతం వృద్ధితో 2,11,158 యూనిట్లకు పెరిగాయి. అయితే.. మోటార్‌సైకిళ్ల అమ్మకాల్లో వేగం కొంత తగ్గింది. గత ఏడాది ఏప్రిల్‌లో 2,20,347 యూనిట్లు అమ్ముడవగా, గత నెలలో ఆ సంఖ్య 2,00,039 యూనిట్లకు పరిమితమైంది.