Posts

Showing posts with the label Supreme Court dismisses Srilakshmi's discharge petition

ఓఎంసీ కేసు : శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేత వేసిన సుప్రీంకోర్టు

Image
ఓ బుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమ మైనింగ్‌ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తనను ఈ కేసు నుంచి తప్పించాలంటూ (డిశ్చార్జ్) ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ కేసు విచారణ సందర్భంగా సీబీఐ గట్టి వాదనలు వినిపించింది. క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని జీవో నుంచి తొలగించడం ద్వారా అక్రమ మైనింగ్‌కు శ్రీలక్ష్మి దారులు తెరిచారని సీబీఐ ఆరోపించింది. శ్రీలక్ష్మి పదవిలో ఉన్న కాలంలో ఆమె మరిది భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని, దీని వెనుక ఆమె ప్రమేయం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ ధర్మాసనం ఈ తీర్పునిస్తూ గతంలో జరిగిన పొరపాటును అంగీకరించింది. "గతంలో మరో కేసుగా భావించి పొరపాటున ఈ కేసుపై స్టే ఇచ్చాం. ఇప్పుడు ఆ పొరపాటును సవరిస్తున్నాం. మేము పొరపాటున ఇచ్చిన స్టేను నిందితులు ఇన్నాళ్లూ ఎంజాయ్ చేశారు" అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. హైకోర్టు ఆదేశాలను సమర్థిస్తూ, శ్రీలక్ష్మిపై ట్రయల్ కోర్టులో విచారణను కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఆ...