లొట్టపీస్ ఛాలెంజ్ లు వేయడం మానేసి, దమ్ముంటే సైబర్ మోసాలను ఆపే పనుల్ని చేయాలి !
ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత సీపీ సజ్జనార్ సినిమా వాళ్లతో మీడియా సమావేశంను ఏర్పాటుచేయడంపై తీన్మార్ మల్లన్న ఫైర్ అయ్యారు. వంద రూపాలయ టికెట్ ను వేలల్లో అమ్ముకుంటున్న వాళ్లు ఏమన్నా సంసారులా అంటూ ఫైర్ అయ్యారు. అంతేకాకుండా నిన్ను చూసి నవ్వాలో ఏడ్వాలో కూడా అర్థం కావట్లేదని సీపీ సజ్జనార్ పై పంచ్ లు వేశారు. తమకు సవాల్ విసిరితే ఏమౌతుందో అని సినిమా వాళ్లను పక్కన పెట్టుకుని సినిమా డైలాగ్ లు కొట్టడం కాదని, దేశంలో ప్రతి 8 నిమిషాల్లో చిన్న పిల్లల్ని కిడ్నాప్ లు చేస్తున్నారని, సైబర్ క్రైమ్ మోసాలు జరుగుతున్నాయని దమ్ముంటే వాటిని ఆపాలంటూ కూడా తీన్మార్ మల్లన్న సజ్జనార్ కు సవాల్ విసిరారు. అంతటితో ఆగకుండా ఐబొమ్మ రవి పోలీసులకు హింట్ ఇవ్వకుంటే పోలీసుల ఆల్సేషన్ కుక్కలైన ఐబొమ్మ రవిని పట్టుకునేవి, మీరు లొట్టపీస్ గాళ్లని తెలిసే ఐబోమ్మ రవి భార్య పోలీసులకు హింట్ ఇచ్చిందన్నారు. అదే విధంగా సీవీ ఆనంద్ సైతం ఐబొమ్మ మోసాలు ఆగవని, ఇవి కొత్త కొత్త మార్గాల్లో మోసాలు జరుగుతూనే ఉంటాయని చెప్పారని తీన్మార్ మల్లన్న గుర్తు చేశారు. లొట్టపీస్ ఛాలెంజ్ లు వేయడం మానేసి, దమ్ముంటే సైబర్ మోసాలను ఆపే పనుల్ని చేయాలని తీన్మార్ మల్లన్...