Posts

Showing posts with the label Stock Market Collapses Like a House of Cards

పేకమేడలా కుప్పకూలిన స్టాక్ మార్కెట్ : ఐదు నిమిషాల్లో రూ.8 లక్షల ఆవిరి

Image
అం తర్జాతీయంగా నెలకొన్న యుద్ధ మేఘాలు దేశీయ మార్కెట్లను కమ్మేశాయి. మార్కెట్ ప్రారంభమైన కేవలం ఐదు నిమిషాల్లోనే ఇన్వెస్టర్ల సంపద సునామీలో కొట్టుకుపోయినట్లుగా రూ.8 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి. ఇరాన్ - అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రతరం కావడంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు దెబ్బతింటుందనే భయాలు మొదలయ్యాయి. దీని ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు $112 మార్కును దాటింది. ముడి చమురు ధరల పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుందనే ఆందోళనతో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు మొగ్గు చూపారు. సెన్సెక్స్ దాదాపు 1,800 పాయింట్లు (2.35%) పతనమై 74,869 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఏకంగా 532 పాయింట్లు (2.23%) నష్టపోయి 23,238 వద్ద స్థిరపడింది. నిన్నటి వరకు లాభాలతో ఊరించిన మార్కెట్, ఈరోజు ఒక్కసారిగా పాతాళానికి పడిపోవడం ఇన్వెస్టర్లను కోలుకోలేని దెబ్బ తీసింది. మార్కెట్ పతనం కేవలం కొన్ని కంపెనీలకే పరిమితం కాలేదు. లార్జ్-క్యాప్ నుంచి స్మాల్-క్యాప్ వరకు అన్ని విభాగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఈ అమ్మకాల ఒత్తిడితో బ్యాంకింగ్, మౌలిక సదుపాయాల రంగాలు తీవ్రంగ...