Posts

Showing posts with the label Sri Lankan Sumit wins gold Mercedes car in Dubai draw

దుబాయ్‌ డ్రాలో గోల్డ్‌ మెర్సిడెస్‌ కారును గెలుచుకున్న శ్రీలంక వాసి సుమిత్

Image
దు బాయ్‌లోని కాల్ సెంటర్‌లో పనిచేస్తున్న శ్రీలంక వాసి సుమిత్  15 వేల దీనార్లతో (సుమారు రూ.3 లక్షల 70వేల) బంగారు బిస్కెట్‌లు కొనుగోలు చేశాడు. ఇటీవల కొత్తగా లాంచ్‌ చేసిన దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌కు వెళ్లడం అతనికి అదే తొలిసారి కూడా. తాను పెట్టిన  పెట్టుబడి కంటే 50 రెట్లు ఎక్కువ విలువైన బహుమతి అతనిని వరించింది. ఈ విషయాన్నిఇంకా నమ్మలేక పోతున్నాను అంటూ సంతోషంతో సుమిత్‌ ఉబ్బితబ్బిబ్బవు తున్నాడు. 20ఏళ్లుగా దుబాయ్‌లో ఉంటున్న సుమిత్‌ దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌లో పెట్టుబడిగా బంగారు బిస్కెట్‌ను కొనుగోలు చేశారు. ఖర్చు చేసిన ప్రతి 500 దిర్హామ్‌లకు ఒక వోచర్‌ను అందించే 'స్పెండ్ అండ్ విన్' ప్రచారం కింద అతనికి రాఫిల్ కూపన్లు 30 వచ్చాయి. డిసెంబర్ 11 - ఫిబ్రవరి 8 వరకు జరిగిన దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్ 'షాప్ & విన్' ప్రచారంలో అతడిని అదృష్టం వరించింది. గోల్డ్‌ బిస్కట్లను కొనుగోలు చేసిన అక్కడున్న కారుతో సుమిత్‌ సరదాగా ఫోటో తీసుకున్నాడు. కానీ అదే కారు గెలుచుకుంటానని మాత్రం అస్సలు ఊహించలేదు. ఒకరోజు నైట్‌ డ్యూటీనుంచి ఉదయం సుమిత్ ఇంటికొచ్చి నిద్రకు ఉపక్రమించాడు. సరిగ్గా అప్పుడే అతని జీవితా...