విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యను సమర్థించుకున్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా
పా ర్లమెంట్ మార్చ్ సందర్భంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యను కేంద్ర మంత్రి జేపీ నడ్డా సమర్థించుకున్నారు. అది కేవలం ఒక సాధారణ శాంతిభద్రతల సమస్య మాత్రమేనని, ప్రతిపక్షాలు ఈ అంశాన్ని అనవసరంగా రాజకీయం మరియు సంచలనం చేస్తున్నాయని ఆయన రాజ్యసభలో విమర్శించారు. విద్యార్థులపై పోలీసుల ప్రవర్తన, పెల్లెట్ గన్స్ వినియోగంపై హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి నడ్డా ప్రభుత్వం తరఫున మాట్లాడారు. రాజ్యసభలో నడ్డా మాట్లాడుతూ చట్టాన్ని, శాంతిభద్రతలను కాపాడటానికే పోలీసులు ఆ సమయంలో చర్యలు తీసుకున్నారని స్పష్టం చేశారు. "విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొనే ఎవరైనా ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నేనూ ఒకప్పుడు విద్యార్థి నాయకుడిగానే ఉన్నాను. కాంగ్రెస్ పాలనలోని ఎమర్జెన్సీ సమయంలో తరగతి గది నుంచి నన్ను కూడా పోలీసులు పలుమార్లు అరెస్ట్ చేశారు" అని నడ్డా గుర్తుచేసుకున్నారు. పోలీసులు కేవలం తమ విధులను మాత్రమే నిర్వహించారని, దీనిపై ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. మరోవైపు, నిరసన తెలిపిన విద్యార్థులపై పోల...