రష్యాలో కుప్పకూలిన రక్షణ శాఖ విమానం : ఆరుగురు సిబ్బంది, 23 మంది ప్రయాణికులు మృతి
ర ష్యాలో రక్షణ శాఖకు చెందిన విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. క్రిమియాలో రష్యా సైనిక ఏఎన్-26 రవాణా విమానం కూలిపోయిందని, ఈ ప్రమాదంలో ఆరుగురు సిబ్బంది, 23 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. టాస్ వార్తా సంస్థ కథనం ప్రకారం, ఆ విమానం ఒక కొండను ఢీకొట్టింది. జిన్హువా వార్తా సంస్థ, మంగళవారం రాత్రి పొద్దుపోయాక విమానం క్రిమియా ద్వీపకల్పం మీదుగా షెడ్యూల్ ప్రకారం ప్రయాణిస్తుండగా దానితో సంబంధాలు తెగిపోయాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ప్రమాదం సాంకేతిక లోపం వల్ల జరిగిందని, విమానాన్ని ఏదీ ఢీకొనలేదని తెలుస్తోంది.