Posts

Showing posts with the label Sirpur constituency of Komaram Bheem Asifabad district

ఎడతెరిపి లేని భారీ వర్షాలు : 12 గిరిజన గ్రామాలకు నిలిచిన రాకపోకలు

Image
తె లంగాణ లోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజక వర్గంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బెజ్జూర్ మండలంలో కృష్ణపల్లి ఒర్రె నిండుగా పారుతోంది. దీంతో సుస్మీర్ సోమిన్, మొగవెల్లి, ఇప్పలగూడ సహా 12 గ్రామాలు మండల కేంద్రంతో సంబంధాలు కోల్పోయాయి. రోడ్లు జలమయమై రాకపోకలు నిలిచిపోవడంతో ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చింతలమానేపల్లి మండలం దిందా వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది ధిందా కేతిని గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. బాబాసాగర్ వాగు ఉప్పొంగడంతో నాయకపుగూడా ప్రజలకు అంతరాయం ఏర్పడింది.