Posts

Showing posts with the label Shankaraiah had sent defamation notices to Chandrababu

పులివెందుల మాజీ సీఐ శంకరయ్యను సర్వీస్ తొలగించిన పోలీసు శాఖ

Image
ఆం ధ్రప్రదేశ్ లోని కడప జిల్లా  పులివెందుల మాజీ సీఐ శంకరయ్యను సర్వీస్ తొలగిస్తూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. సీఐ శంకరయ్య సమక్షంలోనే వివేకానందారెడ్డి హత్య కేసులో ఆధారాలు చెరిపి వేశారని గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు శంకరయ్య పరువు నష్టం నోటీసులు పంపారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు చంద్రబాబు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో సీఐ శంకరయ్యను వీఆర్‌కు పంపారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సీఐ శంకరయ్య సర్వీసును పోలీసు ఉన్నతాధికారులు డిస్మిస్ చేశారు.