Posts

Showing posts with the label Seltos

కియా కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు !

Image
కియా ఇండియా దాదాపు అన్ని పాపులర్ మోడళ్లపై మునుపెన్నడూ లేని విధంగా భారీ ఆఫర్లు, ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ప్రకటించి ఆటోమొబైల్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కియా కార్నివాల్, సెల్టోస్, సోనెట్ వంటి ఎంపిక చేసిన మోడళ్లపై ఏకంగా రూ. 2.70 లక్షల వరకు బంపర్ ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ప్రత్యేక ఆఫర్ల వెనుక కేవలం క్యాష్ డిస్కౌంట్లు మాత్రమే లేవు. కస్టమర్ల విభిన్న అవసరాలకు తగ్గట్టుగా ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, పాత కార్లను వదిలించుకోవాలనుకునే వారి కోసం స్క్రాపేజ్ ప్రయోజనాలు, కియా పాత కస్టమర్ల కోసం లాయల్టీ రివార్డులు మరియు ఉద్యోగుల కోసం కార్పొరేట్ డిస్కౌంట్లను సరికొత్త ప్యాకేజీగా డీలర్లు అందిస్తున్నారు. ఈ లగ్జరీ ఎంపీవీని సొంతం చేసుకోవాలనుకునే వారికి రూ. 2.70 లక్షల వరకు మొత్తం ఆఫర్లు లభిస్తున్నాయి. మరోవైపు, కియా కేరెన్స్ క్లావిస్ టర్బో-పెట్రోల్ వేరియంట్లపై రూ. 1.55 లక్షల వరకు ప్రయోజనాలు ప్రకటించారు. దీనికి అదనంగా కస్టమర్లకు నమ్మకాన్నిచ్చేలా ఉచితంగా 5 సంవత్సరాల పొడిగించిన వారంటీ ప్యాకేజీని కూడా కియా అందిస్తోంది. ఒకవేళ మీరు కేరెన్స్ క్లావిస్ యొక్క డీజిల్ లేదా నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ వెర్షన్లను ఎంచుక...