Posts

Showing posts with the label Security personnel sent the dog back to her residence

శునకంతో పార్లమెంటుకు వచ్చిన రేణుకా చౌదరి : కుక్కను తిరిగి ఆమె నివాసానికి పంపిన భద్రతా సిబ్బంది

Image
కాం గ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి ఈరోజు కారులో ఒక కుక్కను పార్లమెంటు ప్రాంగణానికి తీసుకువచ్చారు. ఇది గమనించిన భద్రతా సిబ్బంది ఆ కుక్కను తిరిగి ఆమె నివాసానికి పంపేశారు. దీనిపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఇది ఎంపీలకు ఇచ్చిన ప్రత్యేక అధికారాలను దుర్వినియోగం చేయడమమే అవుతుందని విమర్శించింది. అయితే దీనిపై రేణుకా చౌదరి ఘాటుగా స్పందించారు. 'ఒక మూగజీవి కారులో ఉండే వారికి ఎందుకు అంత ఇబ్బంది? దీనిపై ఏదైనా చట్టం ఉందా? నేను వస్తుండగా దారిలో ఒక స్కూటరు, కారు ఢీకొన్నాయి. చిన్న కుక్క రోడ్డుపై తిరుగుతోంది. దానికి దెబ్బతగిలి ఉంటుందని అనిపించి దానిని కారులో ఎక్కించుకున్నాను. నేరుగా పార్లమెంటుకు వచ్చాను. వెంటనే దాన్ని వెనక్కి పంపించేశాను. కారు వదిలిపెట్టినట్టే కుక్క విషయంలోనూ చేశాను. దీనిపై చర్చించేదేముంది? కుక్కపిల్ల ఎవరినీ కరవదు. నిజంగా కాట్లు పడిన వారు పార్లమెంటులో కూర్చున్నారు. వాళ్లు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మేము మూగజీవాలను ప్రేమిస్తాం. పార్లమెంటులో కూర్చుని ప్రతిరోజూ మాపై విరుచుపడే వాళ్ల గురించి మేము మాట్లాడదలచు కోలేదు' అని అన్నారు. రేణుకాచౌదరి చర్యను బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ తప్పుపట్టారు....