Posts

Showing posts with the label Second United States

ఎక్కువ మంది భారతీయుల్ని బహిష్కరించిన దేశం సౌదీ అరేబియా

Image
ఈ ఏడాది సౌదీ అరేబియా భారతీయుల్ని అమెరికా కన్నా ఎక్కువ మందిని దేశం నుంచి బహిష్కరించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ రాజ్యసభలో సమర్పించిన డేటా ప్రకారం, ఈ సంవత్సరం సుమారు 81 దేశాలు 24,600 మందికి పైగా భారతీయులను బహిష్కరించాయి, కానీ 2025లో కేవలం సౌదీ అరేబియా మాత్రమే 11,000 మందికి పైగా భారతీయులను బహిష్కరించింది. ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో భారతీయ విద్యార్థులను (170 మందిని) యూకే డిపోర్ట్ చేసింది. 114 మంది ఇండియన్ స్టూడెంట్స్‌ను ఆస్ట్రేలియా బహిష్కరించి రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రష్యా 82 మందిని, అమెరికా 45 మందిని బహిష్కరించింది. పత్రాలపై కఠిననమైన తనిఖీలు, వీసా స్టేటర్, వర్క్ పర్మిట్, గడువు ముగిసిన తర్వాత కూడా నివసించడం వంటి కారణాల వల్ల ఈ ఏడాది అమెరికా సుమారుగా 3800 మంది భారతీయుల్ని బహిష్కరించింది. అమెరికా సంఖ్యతో పోలిస్తే, సౌదీ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా సౌదీలో నివసిస్తుండటంతో చాలా మంది భారతీయుల్ని అక్కడి ప్రభుత్వం డిపోర్ట్ చేసింది.