Posts

Showing posts with the label Samsung's New Phone Leaks Disappoint Tech Enthusiasts

టెక్ ప్రియులను నిరాశపరుస్తున్న శామ్‌సంగ్ కొత్త ఫోన్ల లీక్స్ !

Image
శా మ్‌సంగ్ సిరీస్ నుండి కొత్త ఫోన్లు వస్తున్నాయంటే మార్కెట్లో అంచనాలు భారీగా ఉంటాయి. కానీ, ఇప్పుడు లీకైన 'శామ్‌సంగ్ గెలాక్సీ A27' , 'శామ్‌సంగ్ గెలాక్సీ S26 FE' లీక్స్ చూస్తుంటే మాత్రం టెక్ ప్రియులకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. ఎందుకంటే, ఈ ఫోన్లలో ఎలాంటి కొత్తదనం లేకపోగా, మునుపటి మోడళ్లతో పోలిస్తే కొన్ని ఫీచర్లు మరింత తగ్గినట్లు లీకైన రెండర్లు , స్పెసిఫికేషన్ల షీట్ ద్వారా స్పష్టమవుతోంది. 2026 సంవత్సరం మొత్తం మొబైల్ రంగంలో ఇలాంటి బోరింగ్ , ఖరీదైన అప్‌డేట్స్‌కే పరిమితం కానుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మై మొబైల్స్ లీక్ చేసిన నివేదిక ప్రకారం, శామ్‌సంగ్ బడ్జెట్ శ్రేణిలో ఆలస్యంగా రాబోతున్న 'గెలాక్సీ A27' మోడల్ పాత డిజైన్‌తోనే రానుంది. నిజం చెప్పాలంటే, ఇది మునుపటి గెలాక్సీ A26 కంటే కొన్ని విషయాల్లో వెనుకబడి ఉంది. గెలాక్సీ A26 ఫోన్ 7.7mm మందం ఉండగా, కొత్తగా రాబోయే A27 ఫోన్ 7.8mm మందంతో కాస్త లావుగా ఉండబోతోంది. కెమెరా విభాగంలోనూ కోత విధించినట్లు తెలుస్తోంది. పాత మోడల్లో 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 13MP సెల్ఫీ కెమెరా ఉండగా.. కొత్త గెలాక్సీ A27 లో కేవలం 5MP అల్ట్రా-వైడ్,...