Posts

Showing posts with the label Rs. 1.50 lakh will be provided for houses in urban areas

4.13 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం నిధులు !

Image
ఇం దిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద 2026 - 27 ఫైనాన్షియల్‌ ఇయర్‌లో 4.13 లక్షల ఇళ్లకు నిధులు రానున్నట్టు అధికారులు తెలిపారు. పీఎంఏవై కింద రాష్ట్రంలో నిర్మించనున్న ఇళ్లకు కేంద్రం తన వాటాను విడుదల చేయనుండటంతో లక్షలాది పేద కుటుంబాలకు ఊరట లభించనుంది. పీఎంఏవై కింద పట్టణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, గ్రామాల్లో రూ.72 వేలు అందించనుంది. కాగా ఈ పథకానికి మొత్తం రూ.5 లక్షల నగదు విడతల వారీగా అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. పీఎంఏవై-అర్బన్ 2.0 కింద 1.13 లక్షల ఇళ్లు కేటాయించగా, ఇప్పటికే 10 వేల ఇళ్లకు ఆమోదం లభించింది. మిగిలిన ఇళ్ల కోసం వేల కోట్ల రూపాయలు విడుదల కానున్నాయి.