భారీ లేఆఫ్ దిశగా అడుగులు వేస్తోన్న మెటా ?
భారీ లేఆఫ్ దిశగా మెటా అడుగులు వేస్తోంది. మొత్తం 20 శాతం మందిపై వేటు వేయనుంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థలో పని చేస్తోన్న ఉద్యోగులందరిపైనా దీని ప్రభావం పడబోతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై భారీగా పెట్టుబడుల పెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని ఈ సంస్థ ఈ తాజా చర్య తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పని చేస్తోన్న టెక్కీల్లో కనీసం 15,000 మంది ఇంటిదారి పట్టే అవకాశాలు లేకపోలేదు. మెటా లేఆఫ్స్ పై రాయిటర్స్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ తొలగింపులు మెటా ప్రపంచ ఉద్యోగులలో అయిదోవంతును ప్రభావితం చేయగలవని అభిప్రాయపడింది. కిందటేడాది డిసెంబర్ 31 నాటికి మెటాలో సుమారు 79,000 మంది పనిచేస్తున్నారు. వీరిలో 15,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోవచ్చు. ఏఐలో చేస్తున్న భారీ పెట్టుబడులను సమన్వయం చేసుకునేందుకే కంపెనీ ఈ తొలగింపులకు సిద్ధమవుతోంది. మెటా గతంలో సూపర్‌ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ కోసం బిలియన్ల కొద్దీ డాలర్లు వెచ్చించింది. స్కేల్ ఏఐ స్టార్టప్‌ను 14.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. దాని చీఫ్ అలెగ్జాండర్ వాంగ్‌కు ఎంఎస్ఎల్ బాధ్యతలను అప్పగించింది. దీంతో పాటు ఆర...